పప్పులో కాలేయొద్దు..
‘విషయం వస్తువులో కాదు.. నీ చేతిలో ఉంది’ అంటుంటారు తిండిపుష్టి కలవారు. కానీ, వంట చేసే విధానాన్ని బట్టి ఆ పదార్థానికి అదనపు రుచి అందుతుంది. అదే కుక్కర్, అదే పప్పు, అవే కూరగాయలు.. కానీ, ఒక్కోరోజు పప్పు అదిరిపోతుందంతే! సమయం లేదు మిత్రమా అంటూ... తూతూమంత్రంగా వంటకం కానిచ్చేస్తే.. పప్పులో కాలేసినట్టే ఉంటుంది పదార్థం. పప్పు కూడా లొట్టలేసుకుంటూ తినాలంటే ఇదిగో ఈ చిట్కాలు పాటించేయండి..
‘విషయం వస్తువులో కాదు.. నీ చేతిలో ఉంది’ అంటుంటారు తిండిపుష్టి కలవారు. కానీ, వంట చేసే విధానాన్ని బట్టి ఆ పదార్థానికి అదనపు రుచి అందుతుంది. అదే కుక్కర్, అదే పప్పు, అవే కూరగాయలు.. కానీ, ఒక్కోరోజు పప్పు అదిరిపోతుందంతే! సమయం లేదు మిత్రమా అంటూ… తూతూమంత్రంగా వంటకం కానిచ్చేస్తే.. పప్పులో కాలేసినట్టే ఉంటుంది పదార్థం. పప్పు కూడా లొట్టలేసుకుంటూ తినాలంటే ఇదిగో ఈ చిట్కాలు పాటించేయండి..
పప్పు త్వరగా ఉడికితే.. గ్యాస్ ఆదా అవుతుందని కొందరు కాసింత బేకింగ్ సోడా వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల.. పప్పు సహజ
రుచి కోల్పోతుంది. పైగా అందులోని ప్రొటీన్లు కూడా దెబ్బతింటాయి. అంతేకాదు, సోడా కారణంగా పప్పులో క్షార స్వభావం
పెరుగుతుంది. ఇంకొందరు… పని త్వరగా పూర్తికావాలని కుక్కర్లోనే పోపు వేసి.. టమాట ముక్కలో, పాలకూరో వేసేస్తారు. కాస్త మగ్గిన తర్వాత నానబెట్టిన పప్పు వేసి.. తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత బిగించేస్తారు. నాలుగు విజిల్స్ రాగానే.. తగినంత ఉప్పు వేసి… చేతులు దులుపుకొంటారు. ఈ తరహా వంటకం వేగంగా పూర్తవుతుందేమో కానీ, ఆబగా తినేంత రుచిగా అస్సలు ఉండదు. అంతేకాదు, కాయగూర ముక్కలు, పాలకూర లాంటి ఆకుకూరలు అంతసేపు ఉడికితే.. వాటి సహజ రుచి కోల్పోతాయి. పోషకాల మాట సరేసరి!
రుచికి రుచి, పోషకాలకు పోషకాలు ఉండాలంటే.. పప్పును సెపరేట్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పైన నీళ్లు తేలితే, వాటిని అస్సలు పారపోయకూడదు. అలాగే ఉంచేయాలి. కాయగూర ముక్కలను గానీ, ఆకుకూరలను గానీ వేరే పాత్రలో బాగా ఉడికించి.. ఆ మిశ్రమాన్ని పప్పులో కలుపుకోవాలి. తర్వాత కాసేపు ఉడికించి.. చివరగా తిరగమోత వేసుకుంటే.. పప్పు నెక్ట్స్ లెవల్లో కుదురుతుంది.
ఆహార పదార్థాల్ని పదేపదే వేడిచేయడం చాలా ఇండ్లల్లో చూస్తుంటాం. ఇలా ఉడికిస్తే… పప్పులో ఉండే అమైనో అమ్లాలు తగ్గిపోతాయి. రాత్రి వరకు రుచీపచీ లేకుండా తయారవుతుంది. బాగా నూనె వేస్తే రుచి భలేగా వస్తుందని కొందరి నమ్మకం. పప్పు ఉడుకుతున్నప్పుడు అదే పనిగా పైనుంచి పచ్చి నూనె కుమ్మరిస్తూ ఉంటారు. ఇది పప్పును డామినేట్ చేసి అసలు రుచిని అటకెక్కిస్తుంది.
పోపులోనే అసలు విషయం ఉంటుంది. నూనె బాగా మరిగితే.. తిరగ మోత పక్కింటి వరకూ వినిపిస్తుందేమో! కానీ, మీ పాకం మాత్రం మాడువాసన సంతరించుకుంటుంది. అందుకే, నూనె మధ్యస్తంగా వేడెక్కిన తర్వాత… తాలింపు గింజలు వేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు చివరిగా ఇంగువా వేసి.. పప్పులోకి ఒంపుకొంటే..
అదనపు రుచి ఖాయం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

