తాగు, సాగునీరు అందించాలి
నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. రైతులకు యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల వద్దనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అధికారులు అందుబాటులో ఉండి పరిషరించాలని స్పష్టం చేశారు. హుజూరాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- రైతులకు షాపుల వద్దనే యూరియా ఇవ్వాలి
- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 6: నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. రైతులకు యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల వద్దనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అధికారులు అందుబాటులో ఉండి పరిషరించాలని స్పష్టం చేశారు. హుజూరాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు, పథకాల అమలు, విద్య, వైద్యం, సాగు, తాగునీరు వివిధ అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకు దొరకడం లేదని సర్పంచులు దృష్టికి తీసుకురాగా, తలాపున మానేరు ఉన్నా పిరికెడు ఇసుక దొరకుతలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు పట్టణాల పరిధిలో స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇసుక అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు సకాలంలో యూరియా అందుబాటు లో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. యాప్ పేరిట ఇబ్బంది పెట్టకుండా, నేరుగా షాపుల వద్దనే యూరి యా అందించే విధానం అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. నీటిని ఎత్తిపోయడం వల్ల బ్యారేజ్‌లకు ఇబ్బంది అయితే 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి నిరంతరాయంగా తాగునీరు అందించాలని, గ్రామాల్లో ఎకడైనా పైప్ లైన్లు దెబ్బతిన్నా, లీకేజీలు ఉన్నా వెంటనే గుర్తించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అర్డీవో నాయక్వడి జాలకుమారి, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీతతో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

