సిద్దిపేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డుసభలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో అనర్హులు, కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంIndiramma house) లబ్ధిదారుల జాబితా నుంచి తనను తొలగించడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి(Man climbs) నిరసన తెలిపాడు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట గ్రామస్తుడు మైండ్ల రాజు తన పేరును జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు.
శుక్రవారం జరిగిన గ్రామసభ సమావేశంలో అధికారులు విడుదల చేసిన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదనకు గురైన రాజు సెల్ టవర్ ఎక్కాడు. అధికారులు తన పేరును జాబితాలో చేర్చకపోతే సెల్ టవర్(Cell tower ) పైనుంచి కింద దూకుతానని బెదిరించాడు. జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ నుంచి కూడా హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు ఫోన్లో మాట్లాడి రాజును కిందకు దింపడానికి ప్రయత్నించారు. కాగా, జాబితాలో చాలా మంది ఇతర వ్యక్తుల పేర్లు కనిపించాయని, అయితే వారు అనర్హులు అని ఆయన ఆరోపించారు.