యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో గ్రామసభలు(Grama sabha), వార్డు సభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారుల అలసత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు(Beerla Ialaiah) ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే..ఆత్మకూరు(ఎం)లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు ముఖ్యఅతిథిగాబీర్ల ఐలయ్య హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై గ్రామస్తులు నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. జాబితాలో ఉన్న పేర్లు చదవడం కాదు.. అర్హులైన వారి పేర్లను ఇప్పుడే ఇక్కడే గ్రామ సభలో ప్రకటించాలని నిలదీశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్దిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Sangareddy | కూలిన అంగన్వాడీ సెంటర్ పైకప్పు.. నలుగురు పిల్లలకు గాయాలు
KTR | ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్