సంగారెడ్డి : ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య(Boyfriend Commits suicide) చేసుకున్న సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పుల్కల్ గ్రామానికి చెందిన యువతిని రంజిత్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడు. కాగా, యువతి పుట్టిన రోజు సందర్భంగా రంజిత్ పుల్కల్కు వెళ్లాడు. ఇదే సమయంలో రంజిత్ యువతితో చనువుగా ఉండటంతో యువతి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు తెలిసింది. దీంతో అవమానంగా భావించిన రంజిత్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబ సభ్యులే కొట్టి చంపారని రంజిత్ తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.