Terror Attack | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే కాలంలో ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఎక్కడో ఒకచోట భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
ఆర్మీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. అఖ్నూర్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఓ ఉగ్రవాదిని ఆర్మీ మట్టుబెట్టినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా జమ్ము ప్రాంతంలో విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు జరుగుతోన్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
కాగా, జమ్ముకశ్మీర్ అంతటా.. ముఖ్యంగా లోయలో గత వారంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు సహా కనీసం 12 మంది మరణించారు. అక్టోబర్ 24న, బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు సైనికులు, ఆర్మీలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలు మరణించారు. అంతేకాకుండా గాందర్బల్ జిల్లాలో సోన్మార్గ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ వైద్యుడు, ఐదుగురు వలస కార్మికులు మృతి చెందారు.
Also Read..
C-295 Aircraft | సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారం ప్రారంభం
Air Pollution | ఢిల్లీలో అధ్వాన స్థితికి గాలి నాణ్యత.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు
Nuts For Weight Loss | పండుగ సీజన్లో బరువు పెరగకుండా ఉండాలంటే వీటిని తినండి..!