Nuts For Weight Loss | పండుగ వచ్చిందంటే చాలు చాలా మంది స్వీట్లను తింటుంటారు. దీంతో బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీపావళి పండుగకు చాలా మంది స్వీట్లను తింటుంటారు. బయట స్వీట్లను కొని తేవడమే కాదు, ఇంట్లోనూ వీటిని తయారు చేసి తింటుంటారు. దీంతో కేవలం కొద్ది రోజుల గ్యాప్‌లోనే చాలా మంది కాస్త బరువు పెరుగుతారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే పండుగ సీజన్లో పలు ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. లేదంటే బరువు పెరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే బరువును తగ్గించేందుకు పలు రకాల డ్రై ఫ్రూట్స్ ఎంతో పనిచేస్తాయి. వీటిని ఈ పండుగ సీజన్లో తినడం వల్ల బరువు తగ్గడమే కాదు, పోషకాలను కూడా పొందవచ్చు. ఇక ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటంటే..
అధిక బరువు తగ్గేందుకు బాదంపప్పు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల బాదంపప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం బాదంపప్పు మన శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. కనుక బాదంపప్పును ఈ పండుగ సీజన్లో రోజూ గుప్పెడు తినండి. ఆరోగ్యంగా ఉండండి.
వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. వాల్ నట్స్ ద్వారా మనకు క్యాలరీలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. ఇది బరువును నియంత్రించేందుకు చక్కగా పనిచేస్తుంది. రోజూ గుప్పెడు మోతాదులో వాల్ నట్స్‌ను స్నాక్స్ రూపంలో తీసుకుంటున్నా ప్రయోజనం ఉంటుంది.
నట్స్‌లో పిస్తాపప్పు ఎంతో ప్రాముఖ్యతను పొందింది. పిస్తా పప్పులో క్యాలరీలు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. వీటిని కూడా రోజూ గుప్పెడు మోతాదులో తింటే బరువు నియంత్రణలో ఉంటుంది.
జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటుంది. అందుకనే దీన్ని నేరుగా లేదా పొడి, పేస్ట్ రూపంలో వంటల్లో వేస్తుంటారు. జీడిపప్పులో మెగ్నిషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీర మెటబాలిజంపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. కనుక జీడిపప్పును సైతం రోజూ తినాలి.
ఇక ఇవే కాకుంఆ మనకు బ్రెజిల్ నట్స్, హేజల్ నట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా ఈ సీజన్లో తీసుకోవచ్చు. ఈ నట్స్‌ను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. స్వీట్లు తినాలనే యావ అంతగా ఉండదు. దీంతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి ఈ నట్స్‌ను ఈ పండుగ సీజన్లో ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండవచ్చు.