KTR | నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకు ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్నా, పాతవి అమ్మాలన్నా జనం భయపడుతున్నారని చెప్పారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకు ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్నా, పాతవి అమ్మాలన్నా జనం భయపడుతున్నారని చెప్పారు. తమవి సంపద పెంచే ఆలోచనలని, మీవి ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలని మండిపడ్డారు. తాము బంగారు బాతును చేతిలో పెట్టామని, మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేట్టారని విమర్శించారు.
హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సొంతింటి కలలు కలగానే మిగిలిపోయాయన్నారు. మూసీ ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులయ్యాయని చెప్పారు. కాసులపై నీ కక్కుర్తి నిర్ణయాలు రాష్ట్రన్ని అధోగతిపాలు చెస్తున్నాయని దుయ్యబట్టారు. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, నేడు బోసిపోయాయని విమర్శించారు. నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమేనంటూ ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్భాగ్యపు పాలనకు ఇదిగో ఈ లెక్కలే సాక్ష్యాలంటూ ట్వీట్ చేశారు.
సంపద పెంచే ఆలోచనలు మావి – ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి
మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేడితిరి
నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న – పాతవి అమ్మాలన్న భయమే
నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే
నీ మూసి ముష్ఠి… pic.twitter.com/W2bhQMBFSy
— KTR (@KTRBRS) October 28, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

