Mirzapur The Film | ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌ను సినిమా వెర్షన్ తెరకెక్కించబోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సినిమా వెర్షన్ థియేటర్లలో 2026లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వీడియోను విడుదల చేశారు.
ఇండియన్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు ‘మీర్జాపూర్’(Mirzapur). ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన దీని రెండు భాగాలు రికార్డు స్థాయి వ్యూస్‌తో భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా వచ్చిన మూడో సీజన్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) కూడా ఆల్‌టైం రికార్డు వ్యూస్ అందుకుంటున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే ఈ వెబ్ సిరీస్‌కు పాపులారిటీ వలన ఈ సిరీస్‌ను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా వెర్షన్ థియేటర్లలో 2026లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వీడియోను విడుదల చేశారు.
ఈ సినిమాకు గుర్మిత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. పూనిత్ కృష్ణ కథను అందిస్తున్నాడు. ఎక్సెల్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై రితేష్ సిద్భవాని, ఫర్హాన్ అక్తర్, కాసిమ్ జాక్మార్కింగ్, విశాల్ రసందనిడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.