కరాచీ: పాకిస్థాన్ పరిమితి ఓవర్ల క్రికెట్ కోచ్ గ్యారీ క్రిస్టన్(Gary Kirsten) తన పదవికి రాజీనామా చేశారు. అపాయింట్మెంట్ తీసుకుని ఆర్నెళ్లు గడవక ముందే .. పాకిస్థాన్ బోర్డు, ఆయన మధ్య చీలకలు వచ్చాయి. 2011 వన్డే వరల్డ్‌కప్ సమయంలో భారత కోచ్‌గా ఉన్న గ్యారీ క్రిస్టన్.. ఏప్రిల్‌లో పాకిస్థాన్ కోచ్‌గా నియమితుడయ్యారు. రెండేళ్ల పాటు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కానీ పాకిస్థాన్‌కు మరో కోచ్‌గా ఉన్న జేసన్ గిలెస్పీతో గ్యారీ క్రిస్టన్‌కు విభేధాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆటగాళ్లను ఎంపిక చేసే అధికారాలను ఎత్తివేయాలని బోర్దు నిర్ణయించింది. దీంతో క్రిస్టన్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ఎంపిక ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. త్వరలో గ్యారీ క్రిస్టన్ తన రాజీనామాపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. పాకిస్థాన్ కోచ్‌గా వెళ్లడానికి ముందు.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా చేశారు.
The Pakistan Cricket Board today announced Jason Gillespie will coach the Pakistan men’s cricket team on next month’s white-ball tour of Australia after Gary Kirsten submitted his resignation, which was accepted.
— Pakistan Cricket (@TheRealPCB) October 28, 2024
గ్యారీ క్రిస్టన్ రాజీనామాను ఆమోదించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆస్ట్రేలియా పర్యటన వెళ్తున్న పాకిస్థాన్ జట్టుకు గిలెస్పీ కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది.