Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీ యోగినిమాత ఆధ్యాత్మిక సేవాశ్రమంలో తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల నుండి వచ్చిన భక్తులు గ్రామదేవత మహిశాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం నైవేద్యంగా సమర్పించారు. సుమారు పదిహేను సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు తెలంగాణ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తెలిపారు.
బోనం అంటే భోజనం అని.. గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకుంటూ గ్రామదేవతలకు శాస్ర్తోక్త పూజలు చేసుకుని మేళతాళాలు డప్పుచప్పుళ్లతో అమ్మవారికి సమర్పించే బోనం ఏంతో పవిత్రమనదని గురుమాత యోగినిమాత భక్తులకు వివరించారు. అదే విధంగా శ్రీశైల క్షేత్రంలో బోనాలు నిర్వహించడం అత్యంత ఫలదాయకమని అన్నారు. కార్యక్రమంలో నిరంజన్స్వామి, రాజుస్వామి, రాముస్వామి, నర్సింహస్వామి, వెంకట్స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం
Gift a Smile | కేటీఆర్ బర్త్డే.. 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు అందజేత
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ