Gift a Smile | కేటీఆర్ బర్త్డే.. 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు అందజేత
Gift a Smile | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు.
Gift a Smile | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో స్టేట్ హోంలోని 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు అందజేశారు కేటీఆర్. దీంతో విద్యార్థినులంతా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కూడా కేటీఆర్ ఆర్థిక సాయం అందజేశారు.
హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినులతో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్యతో పాటు స్టేట్ హోం సిబ్బంది పాల్గొన్నారు. ఇక విద్యార్థినులంతా కేటీఆర్కు బర్త్ డే విషెష్ చెప్పారు. ల్యాప్టాప్లు అందించినందుకు కేటీఆర్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ల్యాప్టాప్లు అందుకున్న అమ్మాయిల ముఖంలో సంతోషం వెలిగిపోయింది.
2020 లో కరోనా సమయంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గత ఐదేళ్లలో పలు అంబులెన్స్ లతో 6,000 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాబ్లెట్ పరికరాలను అందజేశారు. 1400 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తన జన్మదినం సందర్భంగానే స్టేట్ హోమ్ విద్యార్థులకు లాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని కానీ ఎన్నికల వలన అది సాధ్యం కాలేదని అన్నారు. గతేడాది ఇచ్చిన హామీ ఈ ఏడాది నెరవేర్చినట్లు కేటీఆర్ చెప్పారు. ఐదేళ్లు తాను చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దలు చెప్పిన్నట్లు పుట్టుక మరణం మాత్రమే నిజమని మధ్యలో మిగిలినదంతా నిజమో? అబద్దమో? తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు. అందుకే జీవితంలో మనసుకి సంతృప్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే తనకు ఎక్కువ సంతోషం లభిస్తుందన్నారు.
తన పుట్టినరోజును హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో జరుపుకున్న కేటీఆర్
పుట్టినరోజు కానుకగా 100 మంది విద్యార్థినులకు లాప్టాప్లను అందజేసిన కేటీఆర్
అలాగే ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం. pic.twitter.com/Tlj2uTxKy4
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024
ఇవి కూడా చదవండి..
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజుల వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
Telanga Assembly | శాసనసభ రేపటికి వాయిదా.. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్
Harish Rao | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి దీక్ష చేస్తే మేం మద్దతిస్తాం : హరీశ్రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

