Rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
Rains | తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండగా మారాయి.
Rains | హైదరాబాద్ : తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండగా మారాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.
బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆసిఫాబాద్,మంచిర్యాల,జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, హనుమకొండ, ములుగు,కామారెడ్డి,సంగారెడ్డి, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ,కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు.
భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని..జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కిందకు వెళ్లరాదని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో జూన్ 1 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 238.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జూలై సాధారణ వర్షపాతం 229.1 మి.మి ఉండగా, ఇప్పటి వరకు 238.9 మి.మీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో అత్యధికంగా 10.02 సెం.మీ, కౌతాలలో 8.44 సెం.మీ, చింతలమానెపల్లి 8.37 సెం.మీ, సిర్పూర్ -టీలో 7.64 సెం.మీ, పెంచికల్‌పేట 6.14 సెం.మీ,దహేగాన్లో 4.66 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ అర్బన్‌లో 6.46 సెం.మీ, బేలలో 4.57 సెం.మీ, ఇంద్రవెల్లిలో 4.56 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Telanga Assembly | శాసనసభ రేపటికి వాయిదా.. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్
Thunga Bhadra Dam | తుంగభద్రకు భారీగా వరద తాకిడి.. ఏకంగా 10 గేట్లు ఎత్తిన అధికారులు
KTR | కేంద్రంపై కేసీఆర్ పోరాటం రాసుకుంటే రామాయణమంతా.. చెప్పుకుంటే భారతమంత.. : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

