Thunga Bhadra Dam : ఎగువన ఎడతెరపిలేని వర్షాల కారణంగా కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వస్తోంది. దాంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 10 గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు 18,686 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇవాళ ఎగువ నుంచి తుంగభద్ర డ్యామ్‌కు 87,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అవుట్ ఫ్లో 18,686 క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం డ్యామ్‌లో 98.961 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 1631.28 అడుగుల మేర నీటి మట్టం ఉందని డ్యామ్ సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అవసరమైతే మరిన్ని గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తామని వెల్లడించారు.
తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 98.961 శాతం టీఎంసీల నీరు నిలువ ఉన్నది. అదేవిధంగా డ్యామ్ పూర్తి నీటి మట్టం 1633 అడుగులు
కాగా.. ఇప్పుడు ఆ నీటి మట్టం 1631.28 అడుగులకు చేరింది.