Housing Board Places | హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి డిమాండ్.. బహిరంగ వేలం ద్వారా భారీగా ఆదాయం
Housing Board Places | నగరంలోని గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9 వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Housing Board Places | హైదరాబాద్, ఫిబ్రవరి 23 : నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రాంతంలో చదరపు గజానికి రూ.1.76 లక్షలకు, కూకట్ పల్లిలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. నగరంలోని గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9 వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో సోమవారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. విక్రయించిన వాటిలో బౌరంపేట భూమితోపాటు, బాచుపల్లిలో ఒక ఫ్లాట్ (Flat)మినహా మిగిలినవ్నీ ఎంఐజి, హెఐజి కేటగిరీలోని ప్లాట్లు (Plots)కావడంతో వీటిని దక్కించుకోడానికి పలువురు పోటీ పడ్డారు. గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌కు రూ.50 వేల అప్ సెట్ ప్రైజ్ (కనీస ధరగా) నిర్దారించి వేలం నిర్వహించగా, దీనికి చదరపు గజం రూ. 1.76 లక్ష ల ధర పలికింది.
అదేవిధంగా కూకట్పల్లి బాలాజీ నగర్‌లోని 266 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌ను వేలం పాటలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లకు కూడా మంచి డిమాండ్‌తో చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేల ధరలతో అమ్ముడు పోయినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ.గౌతం తెలిపారు. అలాగే నిజాంపేటలోని సిద్ధి ఫ్లాట్ (Flat) కు కనీస ధర రూ.15 లక్షలుగా నిర్దారించగా.. దీనిని వేలం పాటలో రూ. 17.70 లక్షలకు కొనుగోలు చేశారు. అదేవిధంగా గచ్చిబౌలిలోని మరో ప్లాట్ (plot) చదరపు గజం లక్ష రూపాయలు పలికింది.
కాగా బౌరంపేటలోని 2600 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని చదరపు గజం రూ.61 వేలకు అమ్ముడు పోయింది. మొత్తంగా సోమవారం నాటి భూముల విక్రయాల ద్వారా రూ.34.27 లక్షల మేర ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ గౌతం వివరించారు.
Read Also :
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

