సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో(Sangareddy district) దారుణం చోటు చేసుకుంది. కత్తులతో పొడిచి ఓ యువకుడిని దుండగులు దారుణంగా(Brutal murder) హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సిద్ధపూర్ కాలనీలో అనిల్(28) అనే యువకుడిని ముగ్గురు దుండగులు కత్తులతో నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అనిల్ మృతితో సిద్ధనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేసేందుకు.. సుప్రీంకోర్టు వద్ద దాసోజు శ్రవణ్
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్