జహీరాబాద్, సెప్టెంబర్ 29 : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో (Electric shock) ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ తండాలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందినట్టు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ సీహెచ్ ప్రసాద్‌రావు తెలిపారు. విశాల్ పవార్(28) అనే వ్యక్తి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టార్టర్ వద్దకు వెళ్లే క్రమంలో నేలపై తెగిపడిన కరెంట్ వైరుకు అయన కాలు తగలడంతో కింద పడి సృహ తప్పిపోయాడు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ దవఖానాకు తరలించారు. అక్కడ దవఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పూర్ణపవార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | 1908లో నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ కూలగొడుతున్నడు.. హరీశ్‌రావు ఫైర్
Airport Metro | ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్పు.. ఫోర్త్ సిటీ వరకు మెట్రో
MLA Jagadish Reddy | ప్రాణం పోయినా ప్రజలకు అన్యాయం జరగనివ్వం : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి