సూర్యాపేట : ప్రజల జీవితాలతో అడుకుంటామంటే చూస్తూ ఊరుకోం. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ (BRS party)మాత్రమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy ) అన్నారు. హైదరాబాద్ తరహాలో సూర్యాపేట పట్టణంలో కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో బాధితులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉంటే.. రేవంత్ రెడ్డి వారి జీవితాలతో అడుకుంటున్నాడని విమర్శించారు.
కేసీఆర్ అభివృద్ధి, నిర్మాణాలు చేపడితే.. కాంగ్రెస్ కూల్చివేతలు చేపడుతున్నదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిచిన కాంగ్రెస్ పార్టీ వారి ఆగడాలను చూస్తుంటే ప్రజల్లో తిరుగుబాటు వల్చేలా ఉందన్నారు. ప్రజలను కన్నీళ్లు పెట్టించడం సమాజానికి మంచిది కాదు. ప్రాణం పోయినా ప్రజలకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.