Harish Rao | హైదరాబాద్ : మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ తన పోరాటాన్ని వేగవంతం చేసింది. హైదర్షాకోట్లో మూసీ బాధితుల ఇండ్లను పార్టీ నేతలు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మూసీ బాధితులకు బీఆర్ఎస్ నేతలు ధైర్యం చెప్పారు. మీకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 1908లో వరదలొచ్చిన నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ నిజాం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాడు. బలిసినోళ్లకు ఒక న్యాయం.. పేదోడికి ఒక న్యాయమా..? మీకు ఇబ్బంది వస్తే.. తెలంగాణ భవన్‌కు రండి.. 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
అర్ధరాత్రి వచ్చినా.. మీకు ఆశ్రయమిస్తామని బాధితులకు హరీశ్‌రావు భరోసానిచ్చారు. అత్యవసరమైతే ఫోన్ చేయండి.. పదిహేను నిమిషాల్లో మీ ముందుంటాం.. రేవంత్‌రెడ్డి బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వు.. మౌనం వీడి మూసీ సుందరీకరణ మానుకో. స్కూళ్లలో, హాస్టల్స్‌లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుండ్రు. నీ దగ్గర పైసలు ఎక్కువుంటే ముందు వాటిని నిర్మించండని హరీశ్‌రావు సూచించారు.
గాంధీ ఆస్పత్రిలో మందులు లేవు.. ముందు అవి కొని, పేదలకు మెరుగైన వైద్యం అందించండని రేవంత్‌కు హరీశ్‌రావు సూచించారు. రేవంత్.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఉసురు పోసుకోకు. మొద్దు నిద్ర పోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపేందుకే మేమంతా మీ ముందుకొచ్చినం. ఆపదొస్తే ఫోన్ చేయండి.. అర్ధగంటలో మీ ముందుంటా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Airport Metro | ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్పు.. ఫోర్త్ సిటీ వరకు మెట్రో
Harish Rao | పాలన పక్కనపెట్టి సుందరీకరణ చేస్తారా.. ప్రజల ఉసురు పోసుకోవద్దు: హరీశ్ రావు
MLA Jagadish Reddy | ప్రాణం పోయినా ప్రజలకు అన్యాయం జరగనివ్వం : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి