Airport Metro | హైదరాబాద్ : మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు తుది మెరుగులు దిద్దారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40 కి.మీ. మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
ఆరాంఘర్ – బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో ఖరారు చేశారు. కారిడార్ -4లో నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది. ఈ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో వెళ్లనుంది. రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫోర్త్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పంపనున్నారు.
మొదటి దశలో 3 కారిడార్లలో 69 కి.మీ. మేర మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కి.మీ. మేర మెట్రో ప్రయాణించనుంది. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కి.మీ. మెట్రో పరుగులు తీయనుంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | పేదలకు ఇండ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం: హరీశ్ రావు
MLA Jagadish Reddy | ప్రాణం పోయినా ప్రజలకు అన్యాయం జరగనివ్వం : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Harish Rao | పాలన పక్కనపెట్టి సుందరీకరణ చేస్తారా.. ప్రజల ఉసురు పోసుకోవద్దు: హరీశ్ రావు