Suicide | నెల్లికుదురు, అక్టోబర్ 4 : ఉద్యోగంలో ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
ఎస్ఐ చిర్ర రమేశ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బచ్చు శంకర్-విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బచ్చు సాకేత్(22) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో 6 నెలలుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్వగ్రామం నెల్లికుదురుకు వచ్చాడు. తను చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఉందని, కొద్దిరోజుల్లో ఈ కంపెనీ నుంచి మరో కంపెనీలో ఉద్యోగం చూసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తూ తెల్లవారుజామున జాబ్‌కు వెళ్తానని చెప్పి నిద్రపోయాడు. లేచి చూసే సరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. చేస్తున్న జాబ్‌లో పని ఒత్తిడిని తట్టుకోలేక మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడని మృతుడి తండ్రి బచ్చు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టానికి మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 నోటిఫికేషన్‌పై తీర్పు రిజర్వ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
Harish Rao | అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి.. రుణమాఫీ చేయిస్తా : హరీశ్‌రావు