RS Praveen Kumar | హైదరాబాద్ : తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీ సరైన పరిశోధన లేకుండా పనిచేస్తోందని ఒక రాజ్యాంగ సంస్థ పేర్కొనడం ఎంత సిగ్గుచేటు. మరి అభ్యర్థులు ఏ పుస్తకాలు చదవాలి..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీజీపీఎస్సీ వాదనలు పక్కదోవ పెడుతున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ వదిలేసి కేవలం తుది కీ అంశానికే పరిమితం చేయాలని చూడడం దురదుష్టకరం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఇప్పటికే రెండుసార్లు వినతిపత్రం ఇచ్చాం. అయినా స్పందన లేదు. భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీ సరైన పరిశోధన లేకుండా పనిచేస్తోందని ఒక రాజ్యాంగ సంస్థ పేర్కొనడం ఎంత సిగ్గుచేటు. మరి అభ్యర్థులు ఏ పుస్తకాలు చదవాలి?
TSPSC GP వాదనలు పక్క దోవ పడుతున్నాయి. Rule of Reservation వదిలేసి కేవలం keys అంశానికే పరిమితం చేయాలని చూడడం దురదుష్టకరం.… pic.twitter.com/1193m8DpNJ— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 4, 2024
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 నోటిఫికేషన్‌పై తీర్పు రిజర్వ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
Harish Rao | అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి.. రుణమాఫీ చేయిస్తా : హరీశ్‌రావు
KTR | దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ చెల్లించాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్