Harish Rao | మహబూబాబాద్ : దసరా పండుగలోపు రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. అవసరమైతే దసరా పండుగ తర్వాత ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. వరంగల్ డిక్లరేషన్‌లో మాటిచ్చిన ప్రకారం.. రుణమాఫీ చేస్తావా.. చెయ్యవా.. అని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తాను. విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. మీరు ధైర్యంగా ఉండండి అని రైతులకు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఒక్క బస్సు తప్ప ఆరు గ్యారెంటీలు తుస్సే అని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం మాటలు నమ్మి రూ. 2 లక్షలపైన అప్పు కడితే రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు చేస్తావ్. నీకు చెవులు, కళ్ళు ఉంటే చేయ్. రైతుల మీద మిత్తి పడుతున్నది. నువ్వు మాఫీ చెయ్యకుంటే పరిస్థితి ఏం కావాలి..? రెండు లక్షల రుణమాఫీ కాలేదని మహబూబాబాద్‌లో రవి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి కనిపించడం లేదా..? రైతుల కన్నీళ్లు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి.. రైతులకు మాత్రం రైతుబంధు ఆపకుండా కేసీఆర్ నిధులు విడుదల చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. కేసీఆర్‌ది రైతు గుండె. అందుకే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ చేశారు కేసీఆర్. అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తున్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చేసిన మోసాలను ప్రతిపక్షంగా వెంటపడి అడుగుతాం. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నడు. పది నెలల్లో ఎన్ని ఇచ్చినవ్. కేసీఆర్ పరీక్షలు పెట్టిన 30,000 ఉద్యోగాలు తప్ప నువ్వు ఇచ్చిందేమీ లేదు. మిగిలిన రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతావా..? డీఏలు ఇవ్వక ఉద్యోగులను మోసం చేసిండు. అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు. రైతులేవరు అధైర్య పడొద్దు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ అమలు చేయిస్తాం అని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
దసరా తరవాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం.. రుణమాఫీ అమలు చేయిస్తాం – హరీష్ రావు pic.twitter.com/9esp4W4T7L
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2024
ఇవి కూడా చదవండి..
KTR | దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ చెల్లించాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్
Jagadish Reddy | మనుషులను మాయం చేసే హీన చరిత్ర మీది : జగదీష్ రెడ్డి
TG Rains | తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు..!