TG Rains | హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ నెల 5వ తేదీన నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
6వ తేదీన రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
7వ తేదీన భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇక హైదరాబాద్లో సాయంత్రం 4 గంటల సమయంలో చల్లని గాలులు వీస్తూ.. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. నగరంలో వర్షం కురియడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. నిన్న, మొన్న నగరంలో పలు చోట్ల వానలు పడిన విషయం తెలిసిందే. టోలిచౌకి, నాంపల్లి, మెహిదీపట్నం, ఎల్బీ నగర్, చైతన్యపురి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో రెండు గంటల్లో సౌత్ హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు అని తేలిపోయింది : హరీశ్ రావు
Jagadish Reddy | హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లు ప్రజలే మంచి, చెడు నిర్ణయిస్తారు : జగదీష్ రెడ్డి
Nagarjuna Sagar | నాగార్జున సాగర్లో పేదోడి ఇంటిపై బుల్డోజర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు