సూర్యాపేట : బీఆర్ఎస్(BRS) పుట్టిందే తెలంగాణ కోసం..కేసీఆర్‌ది నిర్మాణాత్మక ఆలోచన, కాంగ్రెస్ పార్టీది కూలగొట్టే అరాచక పాలన అని సూర్యాపేట మాజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యత్వ బీమా, సీఎం ఆర్ఎఫ్ చెక్కులు( CMRF checks ), ఎల్వోసీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇల్లు ఇస్తారని నమ్మి ఓట్లేస్తే ఉన్న ఇల్లు కూలగొట్టే పరిస్థితి దాపురించిందన్నారు.
రైతు భరోసా లేదు, ఉన్న రైతుబంధు ఇస్తలేరు. అభివృద్ధి చేతకాకనే అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హామీలను గలికొదిలేసి అభివృద్ధిని ఆటకెక్కించారు. ప్రజల సమస్యలు పట్టకపోగా.. వాళ్లే ఇబ్బందులకు గురిచేస్తున్నరు.. అభివృద్ధి చేసిందెవరో, ఆగం చేస్తున్నదెవరో ప్రజలంతా గమనిస్తున్నరు. హంస పాలను, నీళ్లను వేరు చేసినట్లు ప్రజలే మంచి, చెడు నిర్ణయిస్తారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. పార్టీ సభ్యత్వ బీమాతో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3