Ravindra Jadeja | రవీంద్ర జడేజా రాయల్ వెల్కమ్: ‘ధురంధర్’ సీన్‌ను రీక్రియేట్ చేసిన స్టార్ ఆల్‌రౌండర్!
Ravindra Jadeja | మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19 వ సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.
Khamma Ghani | మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19 వ సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో చేరిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు జైపూర్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జడేజా తనదైన శైలిలో సందడి చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటించిన ‘ధురంధర్’ చిత్రంలోని ఒక వైరల్ సీన్‌ను జడేజా అద్భుతంగా రీక్రియేట్ చేశారు. రాజస్థానీ సంప్రదాయ పద్ధతిలో ‘ఖమ్మా ఘని (అందరికి నమస్కారం), రాజస్థాన్!’ అంటూ ఆయన పలకడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్న జడేజా, ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జేర్సీలో తన ప్రయాణాన్ని ప్రారంభించబోతుండటంతో క్రికెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వెల్కమ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా, “జడ్డూ వచ్చేసాడు” అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
𝐊𝐡𝐚𝐦𝐦𝐚 𝐆𝐡𝐚𝐧𝐢, 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 🔥⚔️
Ravindrasinh Jadeja has arrived for IPL 2026 💗 pic.twitter.com/fVUVl5zTjZ
— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

