Harish Rao | మహబూబాబాద్ : పది నెలల ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు.. ఆయన మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నాలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు.
రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైంది. కొమరెల్లి మల్లన్న, యాదాద్రి, భద్రాద్రి, సమ్మక్క – సారలమ్మ మీద ఒట్టు పెట్టి మొనగాడు లెక్క మాట్లాడిండు. కానీ ఇప్పుడు ఆయన మోసగాడు అని తేలిపోయింది. రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అన్నాడు. ఇప్పుడు సప్పుడు లేదు. మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చేయ్ హరీష్ రావు అని సవాల్ విసిరిండు. మరి రుణమాఫీ అయితే ఇంత మంది రైతులు ధర్నాకు ఎందుకు వచ్చారు..? పాలకుర్తి మండలంలోనే 4314 మందికి రుణమాఫీ కాలేదు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
రాష్ట్రంలో 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. మిగతా వారికి కాలేదు అన్నడు. చెప్పిన 22 లక్షల మందిలో కూడా కొందరికి పూర్తిగా రుణమాఫీ కాలేదు. రకరకాల కారణాలతో రుణమాఫీ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 31 సాకులు పెట్టి రుణమాఫీ ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ మోసగాడు అని రైతులు, ప్రజలు అంటున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Akhil Akkineni | సమాజంలో ఆమె లాంటి వాళ్లకు స్థానం లేదు.. కొండా సురేఖపై మండిపడ్డ అఖిల్ అక్కినేని