Nagarjuna Sagar | హైదరాబాద్‌లోనే కాదు నాగార్జున సాగర్‌లోనూ హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పేదోళ్ల ఇండ్లను మున్సిపల్ అధికారులు దౌర్జన్యంతో కూల్చివేస్తున్నారు. సాగర్ పైలాన్‌కు చెందిన ముడావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపైకి 20 మంది సిబ్బందిని తీసుకొచ్చి మున్సిపల్ అధికారులు భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ల ఇంటిని కూల్చివేశారు.
ఈ కూల్చివేతలపై బాధితులు మండిపడుతున్నారు. తమ జాగాలో నిర్మాణం చేపడుతున్న పేదల ఇంటిని మున్సిపల్ కమిషనర్ శ్రీను ఉద్దేశపూర్వకంగానే కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అత్యుత్సాహం చూపిస్తూ ఎలాంటి సమాచారం లేకుండా తమ సిబ్బందితో వచ్చి ఇంటిని కూల్చివేయం ఆమానుషమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
రేవంత్ రెడ్డి సర్కార్ పేదల కడుపు కొడుతున్నదని మండిపడుతున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడం చాతగాక హైడ్రా పేరుతో పేద ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
నాగార్జున సాగర్‌లో హైడ్రా తరహా కూల్చివేతలు
పేదల కడుపు కొడుతున్న రేవంత్ సర్కార్ అంటూ మండిపడుతున్న బాధితులు
ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చాతకాక హైడ్రా పేరుతో పేద ప్రజలపై దౌర్జన్యం
పేదోళ్ల ఇండ్లను దౌర్జన్యంతో కూల్చివేస్తున్న మునిసిపల్ అధికారులు
సాగర్ పైలాన్ కు చెందిన ముడావత్… pic.twitter.com/yY1ihlKc0V
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2024
మరోవైపు మూసీ బాధితులు కూడా రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగానే మాట్లాడుతున్నాడా అని మండిపడుతున్నారు. లక్ష మంది మూసీ బాధితులం జేసీబీలు తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి మీదకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఎంతమంది మీద కేసులు పెడతారు.. రేవంత్ రెడ్డిని చంపడానికి అయినా, చావడానికి అయినా సిద్దమని వార్నింగ్ ఇస్తున్నారు.