సభ్యుల ప్రశ్నలకు జవాబులివ్వని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్
అసెంబ్లీలో అధికార సభ్యుల తీరును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేయటం సర్వసాధారణం. ఇందుకు విరుద్ధంగా కర్ణాటక అసెంబ్లీలో సోమవారం స్పీకర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై తగినంత సంఖ్యలో ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానాలు రాకపోవటంతో స్పీకర్ ఖాదర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అసెంబ్లీ నుంచి స్పీకర్ వాకౌట్!
బెంగళూరు, మార్చి 16 : అసెంబ్లీలో అధికార సభ్యుల తీరును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేయటం సర్వసాధారణం. ఇందుకు విరుద్ధంగా కర్ణాటక అసెంబ్లీలో సోమవారం స్పీకర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై తగినంత సంఖ్యలో ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానాలు రాకపోవటంతో స్పీకర్ ఖాదర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇచ్చే వరకు తాను సభను నడపబోనని పేర్కొంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.
స్పీకర్ నుంచి ఎదురైన అనూహ్య స్పందనతో సిద్ధరామయ్య సర్కార్ షాక్‌కు గురైంది. దీంతో హోంమంత్రి జీ పరమేశ్వర వెంటనే రంగంలోకి దిగి ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నదని ప్రకటించారు. ఎమ్మెల్యేలు అడిగిన 230 ప్రశ్నలపై ఆయన 84 రాత పూర్వక సమాధానాల్ని సభ ముందు ఉంచారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికే ప్రభుత్వం సమాధానం ఇవ్వటాన్ని శుక్రవారం నాటి సభలో స్పీకర్ ఖాదర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సౌమ్యంగా ఉండటాన్ని బలహీనతగా తీసుకోరాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

