హైదరాబాద్ : హైదరాబాద్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) హైడ్రా తరహా(Hydraa demolitions) కూల్చివేతలకు పాల్పడుతున్నది. ముందుస్తు సమాచారం లేకుండా నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా ప్రభుత్వం తన దూడుకుడు తగ్గించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో(Nagarjuna Sagar )మున్సిపల్ అధికారులు ముడావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపై 20 మంది సిబ్బందిని తీసుకొని ఇంటిని కూల్చివేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేతకాక హైడ్రా పేరుతో పేద ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని పేదలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ జాగాలో నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేయడం అమానుషమన్నారు.
నాగార్జున సాగర్లో హైడ్రా తరహా కూల్చివేతలు
పేదల కడుపు కొడుతున్న రేవంత్ సర్కార్ అంటూ మండిపడుతున్న బాధితులు
ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చాతకాక హైడ్రా పేరుతో పేద ప్రజలపై దౌర్జన్యం
పేదోళ్ల ఇండ్లను దౌర్జన్యంతో కూల్చివేస్తున్న మునిసిపల్ అధికారులు
సాగర్ పైలాన్ కు చెందిన ముడావత్… pic.twitter.com/yY1ihlKc0V
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2024