సూర్యాపేట : కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయాలన్న మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మాటలుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఫైర్ అయ్యారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలొచ్చేలా ఉన్నాయన్నారు. స్థాయిలేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆకతాయిలు చేసిన పనులకు కేటీఆర్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఉండి మంత్రులతో అవాకులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.
సురేఖ మాటలు రాజకీయ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. హామీల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ హామీలు విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు. రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ని అంటే కొండా మురళి కనపడటంలేదని కొందరు మీమ్స్ పెడుతున్నారు. మనుషులను మాయం చేసే చరిత్ర మీది. చిల్లర మాటలు అని, అనిపించుకోవడం దేనికని ప్రశ్నించారు. సురేఖవి స్థాయిని దిగజార్చుకునే మాటలే
తప్పా ఆమె సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు.