Kondegari Ramulu | మాజీ ఎమ్మెల్యే కొండేగారి రాములు కన్నుమూత.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
Kondegari Ramulu | ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే కొండేగారి రాములు కన్నుమూశారు.
హైదరాబాద్ : ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే ( Former MLA ) కొండేగారి రాములు ( Kondegari Ramulu) కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1989, 1994లో రెండుసార్లు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సంక్షేమశాఖ శాసనసభ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు.
ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో 120 గజాల్లోని చిన్న ఇంట్లో కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్పైనే ఆయన కాలం వెల్లదీశారు. రాములు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సంతాపం ప్రకటించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కూలీ పని చేసిన శ్రమజీవిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ఎదిగి, ప్రజాదరణతో రెండు దఫాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి, నిరాడంబర జీవితాన్ని గడిపిన ప్రజల మనిషి కొండేగారి రాములు అని ప్రశంసించారు. ఆయన రాజకీయ జీవితం, రేపటి తరానికి ఆదర్శవంతమైనది అని కొనియాడారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాములు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

