గట్టుప్పల్, మార్చి 13 : అర్హులకు పెన్షన్ అందజేయాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలువురు వృద్ధులతో కలిసి ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులను గుర్తించి పెన్షన్ అందజేయాలన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్షన్ రానివారికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంతంగా పెన్షన్ ఇస్తానని అన్నారు. ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకుంటూ పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. మండల వ్యాప్తంగా దాదాపుగా 300 మంది అర్హులు ఉన్నట్లు చెప్పారు. మాటలు కోటలు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ చేతలు గడప దాటడం లేదని ఆయన ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.