Group-1 | హైదరాబాద్ : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణను హైకోర్టు పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కీ, రీ నోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితాను మళ్లీ విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై కోర్టు విచారణ పూర్తి చేసింది. అన్ని అభ్యంతరాలను పరిశీలించాకే తుది కీని విడుదల చేశామని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఉండడంతో ఈ కేసు విచారణకు హైకోర్టు ప్రాధాన్యత ఇచ్చింది.
563 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జనరల్ పోస్టులు 200, ఈడబ్ల్యూఎస్ 49, బీసీ(ఏ) 44, బీసీ (బీ)37, బీసీ(సీ) 13, బీసీ(డీ) 22, బీసీ(ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులు చొప్పున ఉన్నాయి. అన్ని క్యాటగిరీలకు 1:50 నిష్పత్తి ఎంపికలో సర్వీస్ కమిషన్ విఫలమైందని, రిజర్వేషన్ క్యాటగిరీ అభ్యర్థులకు నష్టం జరుగుతున్నదని పలువురు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి.. రుణమాఫీ చేయిస్తా : హరీశ్‌రావు
KTR | దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ చెల్లించాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్
Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు అని తేలిపోయింది : హరీశ్ రావు