వరంగల్ : గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ(Lorry) బోల్తాపడింది. ఈ సంఘటన వరంగల్ (Warangal )జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల(Gas cylinders) లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఖానాపురం మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాలను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.
వరంగల్ నుంచి మహబూబాబాద్ జిల్లా బయ్యారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. గాయపడిన డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Nitin Gadkari: స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే.. శివాజీ విగ్రహం కూలేది కాదు: నితిన్ గడ్కరీ
HYDRAA | హైడ్రా పేరుతొ డబ్బుల వసూళ్లకు పాల్పడితే జైలుకే : ఏవీ రంగనాథ్