Nitin Gadkari: స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే.. శివాజీ విగ్రహం కూలేది కాదు: నితిన్ గడ్కరీ
Nitin Gadkari: 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన విషయం తెలిసిందే. ఒకవేళ స్టెయిన్లెస్ స్టీల్‌తో ఆ విగ్రహాన్ని నిర్మించి ఉంటే, అప్పుడు ఆ విగ్రహం కూలి ఉండేది కాదు అని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.
ముంబై: సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశం గురించి కేంద్ర రోడ్డు, రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) స్పందించారు. ఒకవేళ స్టెయిన్లెస్ స్టీల్‌తో ఆ విగ్రహాన్ని నిర్మించి ఉంటే, అప్పుడు ఆ విగ్రహం కూలి ఉండేది కాదు అని ఆయన అన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో రస్ట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ వాడకం ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. తుప్పు పట్టని ఇనుము వాడాలని సూచించారు. సముద్రానికి దగ్గరలో నిర్మిస్తున్న బ్రిడ్జ్‌లకు స్టెయిన్లెస్ స్టీల్ వాడాలని గత మూడేళ్ల నుంచి చెబుతున్నాని పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ముంబైలో 55 ఫ్లైఓవర్లు నిర్మాణ పనులను పర్యవేక్షించానని, ఐరన్ రాడ్లకు ఏదో ఒక పౌడర్ వేసి వాటిని రస్ట్ ప్రూఫ్‌గా చూపించారని, కానీ ఆ ఇనుము తుప్పు పట్టిందన్నారు. సముద్ర తీరానికి 30 కిలోమీటర్ల పరిధిలో ఉండే అన్ని రోడ్లకు స్టెయిన్లెస్ స్టీల్ వాడాలని సూచిస్తున్నట్లు తెలిపారు.ఒకవేళ ఇటీవల కూలిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్టెయిన్లెస్ స్టీల్‌తో చేసి ఉంటే, అది కూలేది కాదు అని మంత్రి గడ్కరీ తెలిపారు.
నేవీ డే సెలబ్రేషన్స్ సందర్భంగా 2023 డిసెంబర్ 4వ తేదీన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. అయితే ఆ విగ్రహం ఆగస్టు 26వ తేదీన కూలింది. ఈ ఘటనలో సింధుదుర్గ్ పోలీసులు శిల్పి జయదీప్ ఆప్టే గురించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
#WATCH | Delhi: Union Minister Nitin Gadkari says, “…Stainless steel should be used in the construction of bridges built close to the sea…If stainless steel had been used for the statue of Chhatrapati Shivaji, it would have never collapsed. When I was executing the… pic.twitter.com/PR2qbNOOkC
— ANI (@ANI) September 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

