Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాధాకిషన్‌రావు, హరీశ్‌రావులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినట్లు జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం గుర్తుచేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు, రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హరీశ్‌రావు అదే ఏడాది డిసెంబర్ 4న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ గత ఏడాది మార్చి 20వ తేదీన ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జూన్ 18న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆ పిటిషన్లను కొట్టివేసింది.