‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’
మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మార్రూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవనాల నిర్మాణ పనులకు..
– ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, ఫిబ్రవరి 19 : మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మార్రూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవనాల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు సొంత భవనాలు అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు దిశగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి పనికి తన వంతు కృషి చేస్తానని, మహిళల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

