HYDRAA | హైడ్రా పేరుతొ డబ్బుల వసూళ్లకు పాల్పడితే జైలుకే : ఏవీ రంగనాథ్
HYDRAA | హైడ్రాకు(HYDRA) ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) హెచ్చరించారు. కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్దిమంది సామాజిక కార్యకర్తల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ : హైడ్రాకు(HYDRA) ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) హెచ్చరించారు. కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్దిమంది సామాజిక కార్యకర్తల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల ను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు.
అలాగే అధికారులతో ఉన్న ఫొటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొంతమంది వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లను, బహుళ అంతస్తులు, వ్యక్తిగత గృహల్లో నివాసం ఉంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడినా ఇతర ప్రభుత్వ విభాగలైన రెస్క్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాల్లో ఇలా ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో గాని ఎస్పీ, సీపీకి గాని లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విభాగాన్ని నీరు గార్చాలని చూసినా, తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్బీర్-యశ్ చిత్రం
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!

