Wrestlers | స్టార్ రెజ్లర్లు (Wrestlers) కొందరు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే నిజమనే అంటున్నారు. ఇక వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) ఇప్పటికే హస్తం పార్టీలోకి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫోగట్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై స్పష్టత లేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో నేడు బజరంగ్ పునియా (Bajrang Punia), వినేశ్ ఫోగట్ ఇద్దరూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ‘వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ను కలిశారు’ అంటూ ట్వీట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. దీంతో వినేశ్తోపాటూ పునియా కూడా హస్తం పార్టీలో చేరవచ్చని అంతా భావిస్తున్నారు. హర్యానా ఎన్నికల్లో వీరిని పోటీకి దింపే అవకాశం లేకపోలేదంటూ చర్చించుకుంటున్నారు.
नेता विपक्ष श्री @RahulGandhi से विनेश फोगाट जी और बजरंग पुनिया जी ने मुलाकात की। pic.twitter.com/UK7HW6kLEL
— Congress (@INCIndia) September 4, 2024
కాగా హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు చేపట్టారు. అయితే, వచ్చే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. తొలుత అక్టోబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, అక్టోబర్ 2న బిష్ణోయ్ సామాజిక వర్గ శతాబ్దాల నాటి పండుగను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీని అక్టోబర్ 5కు మార్చింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Telangana | కాల్మొక్త సార్.. జీతాలియ్యండి.. మంత్రి శ్రీధర్‌బాబుకు ఎల్లంపల్లి గేట్ ఆపరేటర్ వినతి
Bomb Threat | విశాఖకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
NV Ramana | వరద సహాయార్థం తెలుగు రాష్ట్రాలకు మాజీ సీజేఐ జస్టిన్ ఎన్వీ రమణ విరాళం