NV Ramana | తెలుగు రాష్ట్రాలను (two Telugu states) వరదలు (Floods) ముంచెత్తాయి. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందించారు. ఈ కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read..
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో దిగజారిన పాకిస్థాన్
Bomb Threat | విశాఖకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
Kim Jong Un: 30 మంది అధికారులకు ఉరి.. ఆదేశాలు ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత.. ఎందుకో తెలుసా?