Woman | షాద్‌నగర్ రూరల్ , ఫిబ్రవరి 08 : ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్స్‌ను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సీఐ విజయ్‌కుమార్ వెల్లడించారు.
కర్నూల్ జిల్లాకు చెందిన బెస్తా పవన్‌కల్యాణ్, జేస్వ ఇద్దరూ హైదరాబాద్‌లో రాపిడో రైడర్స్‌గా జీవనం కొనసాగిస్తున్నారు. సులభతరంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటిరి మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడల నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 5న మహబూబ్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మి తన తల్లిగారి ఊరైన ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి వెళ్లేందుకు షాద్‌నగర్ బస్టాండ్‌లో దిగి ఆటోలో గ్రామానికి వెళ్తుండగా ఒంటరిగా ఉన్న ఆమెను గమనించి అదే ఆటోలో పవన్‌కల్యాణ్ ఎక్కాడు. కొద్దిదూరం పోయాక ఆటో పక్కకు ఆపమని చెప్పి దిగుతూ విజయలక్ష్మి మెడలోంచి 2.5తులాల బంగారు గొలుసు దొంగలించి ఆటో వెనకాలనే వస్తున్న జేస్వ బైకు (ఏపీ 13 కేజే 1964)పై ఎక్కి పరారయ్యారు. విజయలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు శంషాబాద్, షాద్‌నగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 2.5తులాల బంగారు గొలుసు, సెల్ ఫోన్, రూ. 30వేల నగదు, బైకు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయి పట్టివేత.. మహిళతో పాటు ఇద్దరు అరెస్టు
NAAC | నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న న్యాక్.. కోర్సుల వివరాలివే..!
Hyderabad | ఠాగూర్ ఆస్పత్రి సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చారని బాధితుల ఆందోళన!