Mee Seva | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం ప్రకటించింది.
కొత్తగా.. గ్యాప్ సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికెట్, మరోసారి సర్టిఫికెట్ల జారీ (రీ ఇష్యూ), క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ), 1బీ సర్టిఫైడ్ కాపీలు ఇకపై ఆన్లైన్లో మీసేవ ద్వారా అందజేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
Zoo Park | హైదరాబాద్‌లో మరో జూ పార్క్.. వెయ్యి ఎకరాల్లో ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశాలు
Robert Vadra | నా భార్య ప్రియాంక గాంధీకి ఆల్ ది బెస్ట్ : రాబర్ట్ వాద్రా
Group-1 | గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయండి.. టీజీపీఎస్సీని ఆశ్రయించిన అభ్యర్థులు