Robert Vadra | హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చేరుకున్న సగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీసీ కోహినూర్ హోటల్లో రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో నేను పవర్ సెంటర్ కావడం భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. నా భార్య ప్రియాంక వయనాడ్ నుండి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. నా భార్యకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారింది. నా భార్య, నా కూతురు భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళనగా అనిపిస్తుంది. భూమిపై నడవాలంటే నా భార్య, కూతురితో సహా దేశంలోని మహిళలందరూ భద్రతగా ఫీల్ అయ్యే రోజు రావాలి. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పాలని రాబర్ట్ వాద్రా సూచించారు.
రాహుల్ గాంధీ, నేను ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాం. దేశంలోని సమస్యలను నేను, రాహుల్ ఒకే కోణంలో చూస్తున్నాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మరో ఐదేళ్ల తర్వాత ప్రజలు మార్పు చూస్తారు. నేను ఆధ్యాత్మిక భావనతోనే హైదరాబాద్ వచ్చాను. అనాథాశ్రమాలు, వికలాంగులను కలవడానికి హైదరాబాద్ వచ్చాను. అలాగే కొన్ని ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్తానని రాబర్ట్ వాద్రా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయండి.. టీజీపీఎస్సీని ఆశ్రయించిన అభ్యర్థులు
GDP | ఆర్బీఐ అంచనాలకు దూరందూరం.. 15 నెలల కనిష్టానికి జీడీపీ.. వ్యవసాయం.. మైనింగ్ రంగాల ఎఫెక్ట్..!
Gus Atkinson | లార్డ్స్‌లో విధ్వంసక సెంచరీ.. కలిస్ వారసుడు ఇతడేనా..?