Gus Atkinson : ఆల్‌రౌండర్ అంటే బంతితోనే కాదు సుమా బ్యాటుతోనూ విధ్వంసం సృష్టించాలి. జట్టుకు కష్టమొస్తే ‘నేనున్నానంటూ’ నిలబడాలి. అది ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ పంపడంలోనైనా.. బౌలర్లను ఉతికేయడంలోనైనా. అప్పుడే నిఖార్సైన ఆల్‌రౌండర్ ట్యాగ్ వస్తుంది. ఇంగ్లండ్ యువ కెరటం గస్ అట్కిన్సన్(Gus Atkinson) ఇప్పుడు అదే చేస్తున్నాడు. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లతో అదరహో అనిపించిన ఈ స్పీడ్‌గన్.. శ్రీలంకపై లార్డ్స్‌లో తొలి సెంచరీతో గర్జించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 8వ స్థానంలో క్రీజులోకి వచ్చిన అతడు మొదటిసారి మూడంకెల స్కోర్ కొట్టి మురిసిపోయాడు. అట్కిన్సన్ బ్యాటింగ్ చూసిన వాళ్లంతా దక్షిణాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ (Jacques Kallis)ను తలపిస్తున్నాడంటూ కితాబిస్తున్నారు. అవతలి ఎండ్‌లో నిల్చొని అట్కిన్సన్ బ్యాటింగ్ విన్యాసాలకు ఫిదా అయిన రూట్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కెరీర్ ఆరంభంలోనే ఇంతటి ప్రశంస లభించడం మామూలు విషయం కాదు.
జాక్వెస్ కలిస్
📅 June 2024 – Never played Test cricket
📅 August 2024 – Has his name on both sides of the Lord’s honours board
Gus Atkinson is some cricketer 🔥 pic.twitter.com/XHQtynVcca
— England Cricket (@englandcricket) August 30, 2024
లార్డ్స్ టెస్టులో అట్సిన్సన్.. శతక వీరుడు జో రూట్(143) అండగా దంచికొట్టాడు. మొదటి రోజు 74 నాటౌట్‌తో క్రీజులోకి వచ్చిన అతడు రెండో రోజు కూడా బజ్‌బాల్ ఆటతో లంక బౌలర్లను ఊచకోత కోశాడు. జట్టు స్కోర్ 308 వద్ద ఏడో వికెట్‌గా
రూట్ ఔటైనా సరే అట్సిన్సన్ జోరు తగ్గించలేదు. కళాత్మక షాట్లతో అలరిస్తూ.. బౌండరీలతో చెలరేగి ఇంగ్లండ్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. చివరకు రత్ననాయకే క్యాచ్ పట్టడంతో 118 పరుగులకు అతడు ఔటయ్యాడు.
☝️ Six wickets
💯 Atkinson 100
😍 And much moreCatch up on all of today’s play, right here 👇
— England Cricket (@englandcricket) August 30, 2024
అట్కిన్సన్ అద్భుత పోరాటంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) వీడ్కోలు మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన అట్కిన్సన్ ఇంగ్లండ్ తరుపుముక్కగా అవతరించాడు. అరంగేట్రంలోనే వెస్టిండీస్‌పై పంజా విసిరిన ఈ పేసర్.. ఇప్పుడు శ్రీలంకపై బ్యాటుతోనూ విధ్వంసం సృష్టిస్తూ దిగ్గజాలను తలపిస్తున్నాడు. అట్కిన్సన్ ఇదే తరహాలో చెలరేగితే రాబోయే యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు తప్పకపోవచ్చు అంటున్నారు క్రికెట్ పండితులు.