Air India- Vistara | ఎయిర్ ఇండియా-విస్తారా విలీనానికి కేంద్రం ఆమోదముద్ర వేసిందని విస్తారా ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. విస్తారా ఎయిర్ లైన్స్ సంస్థలో సింగపూర్ ఫ్లాగ్ షిప్ క్యారియర్ సింగపూర్ ఎయిర్ లైన్స్ (ఎస్ఏఐ)కు 49 శాతం, టాటా సన్స్ సంస్థకు 51 శాతం వాటా ఉంది. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాలో విలీనం చేస్తున్నట్లు 2022 నవంబర్‌లో విస్తారా ఎయిర్ లైన్స్ ప్రకటించింది. విస్తారా ఎయిర్ లైన్స్ లోని సింగపూర్ ఎయిర్ లైన్స్ (ఎస్ఐఏ) వాటా (ఎఫ్‌డీఐ)ను ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి కేంద్రం ఆమోదం తెలుపాల్సిన అవసరం ఏర్పడింది.
టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీనం తర్వాత.. ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ (ఎస్ఐఏ)కు సుమారు 25.1 శాతం వాటా కేటాయిస్తారని తెలుస్తోంది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనంతో టాటా-ఎస్ఏఐ జాయింట్ వెంచర్ మూసివేతకు కేంద్రం ఆమోదం లభించింది. ఈ ఏడాది చివరిలోగా ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీన ప్రక్రియ ముగుస్తుందని తెలుస్తోంది.
Stocks | రికార్డు గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు.. 25 వేలు దాటిన నిఫ్టీ..!
Forex Reserves | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
Air India- Vistara | ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి కేంద్రం ఓకే..
Canada – Immigration Policy | విదేశీ పర్యాటకుల ‘వర్క్ పర్మిట్’ నిలిపేసిన కెనడా.. కారణమిదే..!