లక్నో: ఒక వ్యాపారవేత్త ఇంట్లో రైడ్ (Fake ED Raid) కోసం నకిలీ ఈడీ అధికారులు ప్రయత్నించారు. ఆ వ్యాపారి ఇంట్లో సోదాల కోసం ఫేక్ సెర్చ్ వారెంట్‌ను చూపించారు. అయితే వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అలెర్ట్ చేశాడు. వారంతా అక్కడ గుమిగూడటంతో నకిలీ ఈడీ అధికారులు, నకిలీ పోలీస్ అధికారి కారులో పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 29న ఉదయం ఆరు గంటల సమయంలో గోవింద్ నగర్‌లోని రాధా ఆర్చిడ్‌లో నివసిస్తున్న ప్రముఖ వ్యాపారి ఇంటికి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ముగ్గురు వ్యక్తులు ఈడీ అధికారులమని ఆ వ్యాపారికి చెప్పారు. తమ వెంట పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన ఇంటిని రైడ్ చేస్తున్నామని చెప్పారు. సోదాలు చేసేందుకు తమ వద్ద సెర్చ్ వారెంట్ ఉందంటూ ఒక లెటర్‌ను అతడికి చూపించారు. అలాగే ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కొనేందుకు వారు ప్రయత్నించారు.
కాగా, ఆ వ్యాపారి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈడీ అధికారులమని చెప్పిన వ్యక్తుల బాడీ లాంగ్వేజ్, వారి కదలికలను చూసి ఏదో తేడాగా ఉందని అనుమానించాడు. తన ఇంటి నుంచి బయటకు పరుగు తీసి పొరుగువారిని అలెర్ట్ చేశాడు. దీంతో స్థానికులు ఆయన ఇంటి వద్ద గుమిగూడారు. ఈ నేపథ్యంలో నకిలీ ఈడీ అధికారులు, నకిలీ పోలీస్ అధికారి అక్కడి నుంచి కారులో పారిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నకిలీ ఈడీ అధికారులు, నకిలీ పోలీస్ అధికారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Mathura : मथुरा में हिंदी फिल्म 'स्पेशल 26' जैसा मामला। सर्राफा व्यापारी के घर पर फर्जी ईडी रेड। व्यापारी ने होशियारी दिखाते हुए बचाई जान। घटना का वीडियो वायरल।@mathurapolice @Uppolice #edraid #UttarPradesh pic.twitter.com/sPxCrE3D4l
— Uttar Pradesh Times (@UPTimesLive) August 30, 2024
आज दिनांक 30.08.2024 को थाना गोविन्दनगर क्षेत्रांतर्गत राधा ऑरचिड कॉलोनी में एक व्यवसायी के घर स्वयं को ई.डी. का अधिकारी बता घर की तलाशी लेने की कोशिश करने वाले अज्ञात व्यक्तियो के सम्बन्ध में #ssp_mta @ShaileshP_IPS द्वारा दी गयी बाइट-
@Uppolice @dgpup @adgzoneagra @igrangeagra pic.twitter.com/uFgzWYdKOV— MATHURA POLICE (@mathurapolice) August 30, 2024