Karthik Reddy | హైదరాబాద్ : హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి గ్లాడియేటర్ గేమ్స్ ఆడుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
చెరువులను సంరక్షించాలనే స్పష్టత ప్రభుత్వానికి గానీ, హైడ్రాకు గానీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం ఎల్ఆర్ఎస్ స్కీం తీసుకొచ్చింది. పాత రంగారెడ్డి జిల్లాలో చెరువుల్లో లే అవుట్లు వేయడం జరిగింది. ఈ చెరువుల్లో వేసిన లేఅవుట్లకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద ఇప్పటికి రెగ్యులరైజ్ చేస్తుంది. రామాంతాపూర్ చెరువులో ఉన్న లే అవుట్లకు ఈ రోజుకు కూడా డబ్బులు తీసుకుని ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఎక్కడ స్పష్టత ఉంది. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి..? మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులను తీసుకుని, ఆ ప్లాట్లను క్రమబద్దీకరిస్తున్నట్టే కదా..? మరి దీనిపై ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా..? అని కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ డ్రామాను చూస్తుంటే.. పదిహేను ఏండ్ల కింద వచ్చిన గ్లాడియేటర్ అనే సినిమా గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో కొందరు రోమ్ చక్రవర్తి వద్దకు వెళ్లి పరిస్థితులు బాగాలేవు. ఆకలి చావులు ఉన్నాయి. రోగాలతో లక్షలాది మంది చనిపోతున్నారు. పొరుగు దేశం వాళ్లు యుద్ధానికి వస్తున్నారు.. దీన్ని కాపాడాలని చెప్పినప్పుడు రోమ్ చక్రవర్తి మంచి సలహాల ఇస్తాడట. గ్లాడియేటర్ గేమ్స్ ఆడుదాం అన్నాడట. ఈ ఆట ద్వారా ప్రజల దృష్టిని మరల్చొచ్చు. గ్లాడియేటర్ ఆటలో అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చని చెప్పాడట. అదే ఇవాళ కనిపిస్తుంది. తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రజలు రుణమాఫీ, రైతుబంధు లాంటి సమస్యలు మర్చిపోవాలని గ్లాడియేటర్ గేమ్స్ ఆడుతున్నాడు. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి బీ టీంలాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి హైడ్రా మీద శభాష్ అంటూ కితాబులు ఇస్తున్నారు. కేసీఆర్ మీదున్న కోపాన్ని బీజేపీ ఎంపీలు తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడరు కానీ ఇంకా కేసీఆర్ మీదనే ఏడ్చి చస్తున్నారని పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Uttam kumar reddy | చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్
CM Revanth Reddy | యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు