యాదాద్రి భువనగిరి : నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. గందమళ్ల ప్రాజెక్టును(Gandamalla project) మంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam) అన్నారు. యాదాద్రి భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటి పారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి భువనగిరి పార్లమెంట్ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తానని పేర్కొన్నారు.
చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.
ఎంతటి వారైనా చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టమని స్పష్టం చేశారు. భునియదిగాని, పిల్లయిపల్లి, దర్మారెడ్డి పల్లి కాలువలకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెల్, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.