MLA Rajagopal Reddy | యాదాద్రి భువనగిరి : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, నేను చెప్పింది తప్పక అవుతుందన్నారు. భవిష్యత్‌లో తప్పనిసరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై భువనగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. భవిష్యత్‌లో తప్పనిసరిగా సీఎం అవుతారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, నేను ఏది చెప్పినా తప్పకుండా అయి తీరుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక బునాదిగాని పిల్లయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీ డిజైన్ చేయాలని కోరారు. కాలువల వెడల్పు పెంచాలి.. దీని ద్వారా ఆయకట్టు డబుల్ అవుతుందన్నారు. అధికారులు కాగితాలపై కాకుండా దూరదృష్టితో ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెల్, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Inter Admissions | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు మరోసారి గడువు పొడిగింపు..
Hand Casting | ప్రాణంగా ప్రేమించిన భార్య అనారోగ్యంతో మృతి.. భర్త ఏం చేశాడో తెలుసా..?
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 26 గేట్లు ఎత్తివేత